ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా కవితా దినోత్సవం

5 రోజుల క్రితం

ఘనంగా కవితా దినోత్సవం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- అరసవల్లి

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కవితా దినోత్సవం నిర్వహించారు. కవులు బి.ఉమా మహేశ్వరరావు, ఆర్. వి.రమణ మూర్తి, కుప్పిలి వెంకట రాజారావు, మంగిపూడి శ్రీనివాసరావు, రుష్యశృంగు ఢిల్లేశ్వరరావు, తలగాన లింగరాజు, ఎన్ని అమ్మన్నాయుడు, పత్తి సుమతి, సోడవరంఈశ్వరరావు గ్రంథాలయం అనే అంశంపై కవితలు చదివివినిపించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వివిజిఎస్ శంకరరావు మాట్లాడుతూ ఇంత అద్భుతంగా కవులందరూ ఒకేచోట చేరి కవితా గానాన్ని వినిపించడం అభినందనీయమన్నారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పి.వి. భాస్కర్ రాజా, సిబ్బంది ప్రత్యూష, వరలక్ష్మి, రాంబాబు, రామ్మోహన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్