ప్రజాశక్తి- కోటబొమ్మాళి
పార్వతీపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా ఇటీవల ఎన్నికైన బెలగాం కరుణ ఈ నెల 23న ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఈ మేరకు నిమ్మాడలోని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మంగళవారం కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో కల్పించిన అవకాశాన్ని ప్రజాసేవకు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బి.జయబాబు, బి.సీతారాం, బి.రామకృష్ణ, ఎస్.కమల్ కుమార్, పటానా ప్రేమ్, భరతం సాయి, సిరిపురం బాషా, ఎ.నాగేంద్ర, ఎంబోలిసం సుదీప్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)