ప్రజాశక్తి- అరసవల్లి
కూటమి మేయర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న దానేటి రాధారాణిని ఆదరించి గ్లాసుగుర్తుపై ఓటు వేసి గెలిపించి స్వర్ణ, స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని క్రీడాకారులకు, వాకర్స్‌కు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో మంగళవారం గుడ్‌మార్నింగ్ దానేటి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నగర వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ట్రాక్‌లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ-7 పేరుతో శ్రీకాకుళం నగరాన్ని ఏడు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించినట్టు వివరించారు. శ్రీకాకుళం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన రోడ్లు డ్రైనేజీలతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ప్రతీఒక్కరూ జనసేన పార్టీని ఆదరించి గాజుగ్లాస్‌పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గురుప్రసాద్ గౌడ్, మనోజ్, కాకర్ల ప్రదీప్, రాము, ఢిల్లీ బిసాయి, బోటు లక్ష్మీనారాయణ, రోకళ్ల భాస్కర్, పెద్దింటి రవివర్ధన్, డొక్కరి సూర్య, రాధాకృష్ణ, రవి బిశాయ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)