ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదల సంక్షేమానికి వైసిపి బలోపేతం చేయాలి

20 నవంబర్, 2026

పేదల సంక్షేమానికి వైసిపి బలోపేతం చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ : నగర పాలక సంస్థ పరిధిలోని 8వ డివిజన్ కిల్లిపాలెంకు చెందిన సుమారు 100 కుటుంబాలు తంగి శ్రీపతి, తంగి ఈశ్వర్, వైసిపి రాష్ట్ర ఎస్‌సి సెల్ సభ్యుడు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో వైసిపిలో చేరాయి. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడులు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ధనవంతులకు ప్రయోజనాలు కల్పించే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. వైసిపి హయాంలో నగరంలో సుమారు 20 వేల మందికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిర్మాణాలు నిలిచిపోయాయని ఆరోపించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే వైసిపిని ప్రజలు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్