శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణ అభివృద్ధికి ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలి

20 నవంబర్, 2026

పట్టణ అభివృద్ధికి ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి- ఆమదాలవలస

మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగడానికి పట్టణ ప్రజలందరూ సహకారం అందించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. శుక్రవారం పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ఆమదాలవలస పట్టణాన్ని అందాల నగరంగా తీర్చిదిద్దుతామని పలువురు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల పాలనలో ఇప్పటివరకు ఆమదాలవలస నియోజకవర్గానికి సుమారు రూ.258 కోట్ల విలువైన అభివృద్ధి పనులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి చైర్‌పర్సన్ అభ్యర్థి కూన ప్రమీలతో పాటు 28 వార్డుల్లో కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల, జిల్లా టిడిపి అధ్యక్షుడు మొదలవలస రమేష్, టిడిపి నాయకులు మునగవలస రవీంద్రబాబు, కాగితాపల్లి సంజీవరావు, పొట్నూరు రమేష్, జెజె మోహనరావు, వెంకబాబు, గుడ్ల రాజ్యలక్ష్మి, శిల్లా గురునాథం తదితరులు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్