ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు
ఆడిపాడాల్సిన వయసులో ఆ పసివాడి నవ్వులను ఆ దేవుడు శాశ్వతంగా ఆ కుటుంబానికి దూరం చేశాడు. కన్నవారికి కడుపుకోతను, గ్రామానికి తీరని శోకాన్ని మిగిల్చింది. కేన్సర్ మహమ్మారికి చిన్నారి జోలింగి మేధాంత్ (11) శనివారం బలయ్యాడు. దేంతో అక్కుపల్లిలో తీవ్ర విషాదం నెలకుంది. తండ్రి జోలింగి నారాయణ స్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఈశ్వరి తన ఏకైక కుమారుడు మేధాంత్‌ను సాకుతోంది. ఏడో తరగతి చదువుతూ గత కొద్ది రోజులుగా కేన్సర్ వ్యాధితో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుని మృతదేహానికి తల్లి ఈశ్వరి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఫొటో: మేధాంత్ (ఫైల్)







కామెంట్‌లు (0)