ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు
మండలంలో 37 పంచాయతీల్లో నిర్వహించనున్న ఎ్నకలకు సంబందించి శనివారం నిమినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో మండల వ్యాప్తంగా 37 పంచాయతీలకు గాను 8 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 183 మంది నామినేషన్లు వేయగా, ఇందులో 35 మంది పోటీల్లో నిలిచినట్లు ఎన్నికల అధికారి, ఎంపిడిఒ రమేష్ నాయుడు తెలిపారు. అలాగే 185 వార్డులకు గాను బరిలో 389 మంది వార్డు సభ్యులు పోటీ చేస్తున్నారని అన్నారు. వీరందరికీ ఓటింగ్ కోసం గుర్తులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఎనిమిది ఏకగ్రీవం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 37 పంచాయతీలకు గాను ఎనిమిది పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా వేసిన నామినేషన్లలో ఉప సంవహరణ ముగిసింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క నామినేషన్ పడిన గోవిందపురం, ఉద్దానం గోపినాథపురం, కొత్తపేట, సైనూరు, ఉద్దానం రామకృష్ణాపురం, చీపురుపల్లి, కిడిసింగి శారదాపురం, నువ్వలరేవు పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఈ నెల 26 వారికి డిక్లరేషన్ ఫారాలు అందిస్తామని వివరించారు.







కామెంట్‌లు (0)