శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెడ్‌పిటిసి ప్రమాణస్వీకారం

20 నవంబర్, 2026

జెడ్‌పిటిసి ప్రమాణస్వీకారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం నియోజకవర్గ చరిత్రలో జెడ్‌పిటిసి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరూ సాధించని రికార్డును తిప్పన నీలవేణి దుర్యోధనరెడ్డి సొంతం చేసుకున్నారు. 6419 ఓట్ల భారీ మెజారిటీతో తొలిసారి గెలుపొందారు. ఇచ్ఛాపురం రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఈ సందర్భంగా జెడ్‌పి కార్యాలయంలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసైనికులు, వీర మహిళలు, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.ప్రజలు ఇచ్చిన ఈ భారీ మెజారిటీకి తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఇచ్ఛాపురం మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకుని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా నీలవేణిని సూడా చైర్మన్ కోరికన రవికుమార్ అభినందించారు. అనంతరం ఇచ్ఛాపురం చేరుకున్న వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్