ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీ ఎన్నికల భద్రతపై పోలీసులుకు దిశానిర్దేశం : అదనపు ఎస్పీ

1 రోజు క్రితం

పంచాయతీ ఎన్నికల భద్రత,పై పోలీసులుకు దిశానిర్దేశం. 
అదనపు ఎస్పీ. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పోలింగ్‌ స్వే‌చ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలి

- ఎన్నికల భద్రతపై ఎఎస్పీ పోలీసులకు దిశా నిర్దేశం

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్ : పోలింగ్‌ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎఎస్పీ అంకితసురాన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రెం‌డో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఎస్‌.సతీష్‌‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లాలో పలుచోట్ల క్షేత్రస్థాయిలో పోలీసు విధులు, భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహణపై శనివారం పుట్టపర్తి, పుట్టపర్తి రూరల్, కొత్తచెరువు సర్కిల్ కార్యాలయాల్లో ఎఎస్పీ అంకితసురానా డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేసి, ఓటింగ్ ప్రక్రియ క్రమబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎన్నికల నిబంధనలు అమలు చేయాలని, ఓటింగ్ కేంద్రాల వద్ద సమీపంలో గుంపులుగా చేరకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద అత్యంత అప్రమత్తతో పటిష్ట భద్రత కల్పించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ ఎన్నికలు స్వే‌చ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ నిరంతరం నిఘా కొనసాగిస్తూ, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాసులు, రవిబాబు, సిఐలు సురేష్, రాజశేఖర్, కరీం, గోపీనాథ్‌రెడ్డి, రా‌జ్‌కుమార్, సునీత, వివిధ మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్