- మాదిగ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఏర్పాటు
ప్రజాశక్తి - కదిరి : మాదిగ ఉద్యోగుల ఐక్యత అభ్యున్నతి హక్కుల సాధన సమస్యల పరిష్కారానికి సామాజిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి నాగేంద్ర తెలిపారు.ఆదివారం కదిరి నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.మాదిగ ఉద్యోగుల సమాఖ్య శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి. నాగేంద్రనాథ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.కదిరి నియోజకవర్గం అధ్యక్షులుగా శ్రీనివాసులుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవఅధ్యక్షులుగా నాగప్ప, గౌరవ సలహాదారులుగా పుల్లన్న, నియోజకవర్గ అధ్యక్షులుగా శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చినస్వామయ్య, ఉపాధ్యక్షులుగా సూర్యనారాయణ, ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా పలక నాగరాజు తదితరులను ఎన్నుకున్నారు.







కామెంట్‌లు (0)