ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెడుతున్న కూటమి ప్రభుత్వం

02 అక్టోబర్, 2026

చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెడుతున్న కూటమి ప్రభుత్వం
ధర్మవరం ప్రజాశక్తి రూరల్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ధర్మవరం రూరల్

ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులకు ‘నేతన్న సేవలో’ పథకం అమలు చేయకుండా వారి చెవిలో పూలు పెడుతుందని సిఐటియు నాయకులు మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలో చేనేత కార్మిక సంఘం నాయకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అలాగే గాంధీ విగ్రహానికి రేషంమాల వేసి నిరసన తెలిపారు. ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ఎపి చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జెవి.రమణ, నాయకులు ఎస్‌‌హెచ్‌.బాషా, ఆర్‌‌ఎస్‌పి రాష్ట్ర నాయకులు మంజుల నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 వేల మంది చేనేత కార్మికులను గుర్తించామని, వారందరికీ ఆగస్టు 30వ తేదీ నగదు జమ చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హామీ ఇచ్చినా నేటికీ నగదు జమ కాలేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చేనేత కార్మికుల బ్యాంకు ఖాతలోల్ నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయుబ్‌ఖాన్, నాయకులు ఆదినారాయణ, నారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకులు హరి, ఎ.ఖాదర్‌‌బాషా, వి.వెంకటస్వామి, లోకేష్, సూరి, తిమ్మరాజు, శివప్రసాద్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్