ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి....సిఐటియూ డిమాండ్

02 అక్టోబర్, 2026

అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి....సిఐటియూ డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 05:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కదిరి టౌన్‌ : అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ అనుబంధ సిఐటియు నాయకురాలు సుజాత డిమాండ్ చేశారు. మండలంలోని కుమ్మరవాండ్లపల్లి సెక్టార్‌‌లో అంగన్వాడీ వర్కర్స్ గాంధీ చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శి బాబ్‌జాన్ అంగన్వాడీల సమస్యలను ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామ్మోహన్, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజాత, భారతి, సువర్ణ, లక్ష్మీ, చెన్నమ్మ, ధనలక్ష్మి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్