బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుంటలు, బావుల వద్దకు వెళ్లవద్దు.. అప్రమత్తంగా ఉండండి.! పుట్లూరు చెరువు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తహసిల్దార్ బాలమ్మ

1 గంట క్రితం

కుంటలు, బావుల వద్దకు వెళ్లవద్దు.. అప్రమత్తంగా ఉండండి.! పుట్లూరు చెరువు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తహసిల్దార్ బాలమ్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు

మండలంలోని కుంటలు, బావులు ఆటస్థలాలు కావు.. ప్రమాదాలు పొంచి ఉండే ప్రదేశాలు. దసరా సెలవులు కావున పిల్లలు ఇంటి వద్దనే ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ బాలమ్మ సూచించారు. ఆమె బుధవారం పుట్లూరులో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలు ఆడుకోవడానికి, ఈత కొట్టడానికి కుంటలు, బావుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి లోతు తెలియక ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. కావున పిల్లలను ఎల్లప్పుడూ గమనిస్తూ, నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

చెరువులు, కుంటలు, నీరు ఉన్న ప్రదేశాల వద్దకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ ప్రమాదం జరిగితే అత్యవసర సాయం కోసం వెంటనే 112, 108ను సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్