బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ చైర్మన్ రేసులో బీసీ నేత మహమ్మద్ రఫీ

1 గంట క్రితం

మున్సిపల్ చైర్మన్ రేసులో బీసీ నేత మహమ్మద్ రఫీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పుట్టపర్తి మున్సిపాలిటీలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడిగా గుర్తింపు ఉన్న షేక్ మహమ్మద్ రఫీ కి మున్సిపల్ చైర్మన్ సీటును టిడిపి టికెట్ కేటాయించాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. దాదాపు 14 ఏళ్లు సత్యసాయి సన్నిధిలో ఫోటోగ్రాఫర్ గా సేవలందించారు.2014 లో 13వ వార్డు టిడిపి కౌన్సిలర్ గా రఫీ సతీమణి షేక్ దిల్షాద్ గెలుపొంది అప్పటి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సహకారంతో వార్డులో అండర్ డ్రైనేజీ సిసి రహదారులు తాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. పట్టణంలో రూ.1.25 కోట్ల తో షాది మహల్ నిర్మాణానికి రఫీ విశేష కృషి చేశారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ టిడిపి బలోపేతానికి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పార్టీకి సేవలు అందిస్తూఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మన్ననలు పొందుతున్నారన్నారు. పట్టణంలోని సమస్యలను పుట్టపర్తికి వచ్చే వీవీఐపీల దృష్టికి కలెక్టర్ఇతర ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నాడని పలువురు గుర్తు చేస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వివాదరహితుడిగా సౌమ్యడిగా ,అందరివాడుగా ఉన్న రఫీ లాంటి సేవా దృక్పథం కలిగిన నాయకులు అవసరమన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్