అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లకు (AICS) 2026-27 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్లను ఏర్పాటు చేసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వి. కిశోర్ తెలిపారు. 22న ధర్మవరం బాలుర ఉన్నత పాఠశాలలో అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. 23న ధర్మవరం కళాజ్యోతి ఇండోర్ స్టేడియంలోబెస్ట్ ఫిజిక్, క్యారమ్స్, చెస్, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి గల సివిల్ సర్వీస్ ఉద్యోగులు 20వ తేదీ లోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, పుట్టపర్తిలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 28 నుండి 30 వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 9848187636 నంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు.
సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)