ప్రజాశక్తి - మడకశిర
అందరికి ఆమోదయోగ్యమైన గ్రామాభివృద్ధి పనులపై దృష్టి సారించి పరిష్కరించే వ్యక్తులనే రాబోవు రోజుల్లో గ్రామ సర్పంచు అభ్యర్థిని నిర్ణయించుకొని ఎన్నుకుందామని ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.మెళవాయి పంచాయితీ సర్పంచ్ గా అర్హత అభ్యర్థిని ఎవర్ని ఎంపిక చేసుకుందామని సోమవారం కూటమి నేత లు కీలక భేటీ అయ్యారు.శాసన సభ్యులు ఎమ్మెస్ రాజు , మాజీ శాసన మండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి ఆదేశాలతో స్థానిక నేతలందరూ సమావేశం అయ్యారు. గ్రామసమస్య ఏది వచ్చినా,ఇబ్బందులు ఎదురైనా నాయకుడు అనేవాడు అందుబాటులో ఉండి పరిష్క రించే నాయకత్వ లక్షణాలున్న వ్యక్తిని నాయకుడిని ఎంపిక చేసుకుందామని లక్ష్మీనారాయణ అన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఎంపిక, పంచాయితీలో కూటమి బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం తదితర వాటిపై నాయకులు ఏక తాటిపై సుదీర్ఘంగా చర్చించారు. సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటు న్న ఆశావహుల పేర్లను తీసుకుని సుచాప్రాయంగా పార్టీ అధిష్ఠాన నేతల దృష్టికి పంపించామని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు అ భ్యర్థిని ఖరారు చేసి, కూటమి నేతల ఐక్యతతో పంచాయితీలో సర్పంచ్ గెలుపు సాధించేలా నాయకులందరులు శ్రమించాలని కోరా రు.సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు నారాయణ గౌడ్,సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి,స్థానిక కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)