ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూగర్భ జలాల పెంపే లక్ష్యం - కలెక్టర్ శ్యాం ప్రసాద్

6 రోజుల క్రితం

భూగర్భ జలాల పెంపే లక్ష్యం
కలెక్టర్ శ్యాం ప్రసాద్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 06:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జిల్లానీటిపారుదల శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థల అధికారులు పనిచేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం శ్రీ సత్యసాయి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్, డ్వామా అధికారులతో పాటు సంబంధిత ఏపీవోలు, డిఇలు, ఏఈలతో భూగర్భ జలాల పెంపుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందున రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచు‌కుని ఇరిగేషన్ అధికారులు వెంటనే జిల్లాలోని అన్ని చెరువులు, కుంటల్లోకి నీరు చేరే విధంగా చర్యలు చేపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, కాలువలకు అవసరమైన చోట మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. డ్వామా అధికారులు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలన్నారు. జలధార జల హారతి 2.0 కింద కేటాయించిన జల సంరక్షణ పనులు అన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలని, పూడికతీత చెక్ డ్యామ్‌ల నిర్మాణం, ఇంకుడు గుంతలు చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవడమే గాక సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విజయ్ ప్రసాద్ ఇరిగేషన్ ఎస్ఈతో పాటు ఈఈ, డిఈలు, ఏఈలు ఏపీవోలు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్