ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలి

6 రోజుల క్రితం

ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 06:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఏడి లేజర్ అన్నారు. సోమవారం మండలంలోని రొద్దం ప్రభుత్వ హైస్కూల్‌‌ను అయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పాసు మార్కులకు కాకుండా, ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా చదవాలని సూచించారు. రొద్దం లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ కు ఓపెన్ స్కూల్ సెంటర్ గా ఆవిష్కరించబడిందన్నారు. 10, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ లో 2026-2027కి అడ్మిషన్స్ రొద్దం జడ్పీహెచ్ ఎస్ జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీనారాయణమ్మ, ఎంఇఒలు అరవింద్ కుమార్, విజయభాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్