ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కదిరిలో ప్రజా సేవ @30 - మూడోసారి కౌన్సిలర్‌గా ఎస్.బి. విజయలక్ష్మి

5 రోజుల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 24వ వార్డు కౌన్సిలర్‌

ఎమ్మెల్యే అడుగుజాడల్లో ప్రయాణం

టీడీపీనే నమ్ముకొని రాజకీయ ప్రస్థానం


కదిరి పట్టణం లో ప్రజా సేవకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మహిళా నాయకురాలిగా ఎస్.బి. విజయలక్ష్మి ఆ వార్డు ప్రజలలో గుర్తింపు పొందారు. సుమారు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంతో అనుబంధం కొనసాగిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ వార్డులోని ప్రజా సమస్యలపై సత్వరం స్పందించడం తన బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు.ఒకవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడం , మరోవైపు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తన ప్రయాణాన్ని కొనసాగించడం ఆమె దినచర్యగా మారింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధి తో పనిచేస్తున్నట్లు ఆ వార్డు ప్రజలు విజయలక్ష్మిని అభినందిస్తున్నారు.


​ప్రతి పక్షంలోనూ ప్రజల మధ్యే ఉంటూ సమస్యలపై పోరాటం

​ప్రజాప్రతినిధి అంటే కేవలం ఎన్నికల్లో గెలిచి పదవిని చేపట్టడం మాత్రమే కాదనీ. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం కోసం చొరవ చూపడం ముఖ్యమనే భావనతో విజయలక్ష్మి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పదవి లేకున్నా ప్రతి పక్షంలో కూడా తన ప్రజా సేవను కొనసాగించారు.


ఎమ్మెల్యే కందికుంట నాయకత్వంలో అడుగులు

కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంపై విశ్వాసంతో ఎస్.బి. విజయలక్ష్మి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పార్టీ ఆవిర్భావం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.


మూడోసారి కౌన్సిలర్‌గా విజయం

​24వ వార్డు ప్రజల ఆదరణతో ఎస్.బి. విజయలక్ష్మి మూడోసారి కౌన్సిలర్‌గా గెలుపొందడం ఆమె రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2026 నవంబర్ 3న ప్రకటించిన కదిరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 24వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె ఎన్నికయ్యారు.మూడోసారి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం వెనుక వార్డులో ప్రజలతో ఉన్న సంబంధాలు, రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై స్పందించే తీరుకు ప్రాధాన్యత ఉందని ఆమె అనుచరులు భావిస్తున్నారు.


​ ముందున్న లక్ష్యం

మూడు దశాబ్దాల ప్రజా సేవా అనుభవంతో మరోసారి కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి ముందున్న ప్రధాన సవాలు 24వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించడం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం , పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో వార్డు అభివృద్ధికి మరింత కృషి చేయాలని స్థానికులు ఆశిస్తున్నారు.

.రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజలతో ఏర్పడిన అనుబంధమే నాయకులకు అసలైన గుర్తింపును తీసుకొస్తుంది. మూడు దశాబ్దాల ప్రజా సేవా ప్రస్థానంలో మూడోసారి కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఎస్.బి. విజయలక్ష్మి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టి ప్రజల ఆకాంక్షలకు కోసం పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్