శ్రీ సత్యసాయి జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ నూతన కార్యదర్శిగా శుక్రవారం పోలినేని జయచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖాధికారి, డీసీఈబీ చైర్మన్ కిష్టప్ప సమక్షంలో పూర్వ కార్యదర్శి శ్రీ ఎస్. గోపాల్ నూతన కార్యదర్శికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖాధికారి మార్గదర్శకత్వంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరి సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ పి. శ్రీనివాసరావు , డీఈఓ కార్యాలయ సిబ్బంది, సమగ్ర శిక్షా ఎస్ఎస్ఏ కార్యాలయ సిబ్బంది నూతన కార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు.
డిసిఇబి నూతన కార్యదర్శిగా జయచంద్ర
20 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 06:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)