ప్రజాశక్తి-కొత్తచెరువు
గ్రామ పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సర్పంచి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం ప్రారంభించారు. కొత్తచెరువు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి పదవికి 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా 16 వార్డు మెంబర్లకు 64 మంది నామినేషన్లు వేశారు. మేజర్ పంచాయతీలో దాదాపు 12వేల ఓట్లు ఉన్నాయి. సర్పంచి స్థానం బీసీ రిజర్వేషన్ కావడంతో టిడిపి, వైసిపి, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. టిడిపి మద్దతుతో కట్టెల డిపో భాస్కర్, వైసిపి మద్దతుతో ఎం.నాగమణి, స్వతంత్ర అభ్యర్థులుగా మాణిక్యం బాబా, ఎం.పాపన్న, బెల్లం నజీర్, కురుబ నాగేంద్ర, మరి కొందరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే భాస్కర్, నాగమణి, మాణిక్యం బాబా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమను సర్పంచిగా గెలిపిస్తే పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఏదేమైనా విత్ డ్రా అనంతరం ఎంతమంది బరిలో ఉంటారో వేసి చూడాలి.







కామెంట్లు (0)