శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలిరోజు 16 సర్పంచ్‌, 18 వార్డు సభ్యుల నామినేషన్లు -నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీఓ దామోదరమ్మ

6 రోజుల క్రితం

తొలిరోజు 16 సర్పంచ్‌, 18 వార్డు సభ్యుల నామినేషన్లు
-ఆరు పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు
-రెండు పంచాయతీల్లో వార్డు సభ్యుల నామినేషన్ల దాఖలు
-నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీఓ దామోదరమ్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–హిందూపురం

హిందూపురం రూరల్‌ మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమైంది. శనివారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 34 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ దామోదరమ్మ వివరించారు. ఇందులో సర్పంచి స్థానాలకు-16, వార్డు సభ్యుల స్థానాలకు-18 నామినేషన్లు నమోదైనట్లు తెలిపారు. సర్పంచి స్థానాలకు చౌళూరు-3, కిరికెర-2, కొటిపి-4, మణేసముద్రం-2, పులకుంట-2, తూముకుంట-3 నామినేషన్లు దాఖలయ్యాయి. బాలంపల్లి, ఎం.బీరేపల్లి, బెవెనహళ్లి, చలివెందుల, గొల్లాపురం, కగ్గల్లు, మలుగూరు, శాంతిబిదనూరులో తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. వార్డు సభ్యుల స్థానాలకు కిరికెరలో 6, కొటిపిలో 12 నామినేషన్లు నమోదయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టిన ఏర్పాట్లను ఎంపీడీఓ దామోదరమ్మ ఈఓఆర్డీలు శివకుమార్‌, నారాయణలతో కలిసి వివిధ నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్