ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తన కుమారుడు వాసు యాదవ్ పై తిరుపతి టిడిపి ఇంచార్జి జేబి శ్రీనివాస్ అక్రమ కేసు పెట్టి, జైలుకు పంపాలని కుట్ర పన్నారని, వైసిపి నాయకులు వాసు యాదవ్ తల్లి రేణుకా యాదవ్ విమర్శించారు. అలిపిరి పాదాల మండపం వద్ద శుక్రవారం ఆమె వెంకటేశ్వరస్వామి విగ్రహం ముందు ప్రమాణం చేశారు. గరుడ సర్కిల్ వద్ద ఆమె మీడియతో మాట్లాడుతూ .... తన కుమారుడు వాసు యాదవ్ జెబి శ్రీనివాస్ పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని కేసు పెట్టడం దారుణమన్నారు. ఆ సమయంలో తన కొడుకు అక్కడ లేడని, కావాలని ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చేర్యలో భాగంగా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే తన కుమారుడు సైతం స్వయంగా కాణిపాకం వినాయక స్వామి వద్ద ప్రమాణం చేసి వెల్లడించాడని గుర్తు చేశారు. రాజకీయాలలో కక్ష సాధింపులు సరైనది కాదన్నారు. తన కొడుకు పై పెట్టిన అక్రమ కేసుల పై పోరాటం చేస్తామన్నారు. వైసిపి ఎమ్మెల్సీ, బీసీ విభాగం అధ్యక్షులు రమేష్ యాదవ్ మాట్లాడుతూ .... తిరుపతి వంటి ప్రాంతంలో యాదవులపై కక్ష పూర్వక ధోరణి సరైనది కాదని, దీనిని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కూటమి ప్రభుత్వంలో గూండాలకు, రౌడీలకు ప్రభుత్వం పెద్దలు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డాక్టర్ శిరీషా, తులసి యాదవ్, అరుణ్ యాదవ్, మోహన్ యాదవ్, కట్టా గోపి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)