లండన్ : లండన్ లోని ఓ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడు మృతి చెందాడు. ఆయన మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు మద్యం, డ్రగ్స్, ఔషధాలు ఒకేసారి తీసుకోవడం వల్లే మరణించినట్లు దర్యాప్తులో వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం .... సౌదీ రాజకుమారుడు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ గతేడాది నవంబర్‌లో లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో బస చేశారు. నవంబరు 25వ తేదీన హోటల్ గదిలో స్పృహ కోల్పోయి కనిపించారు. సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. రాకుమారుడి (29) మృతిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలు వెల్లడించారు. అబ్దుల్లా పెద్ద మొత్తంలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే అదే సమయంలో అతడు మద్యం మానేయడానికి ఔషధాలు కూడా వాడుతుండటం గమనార్హం. మద్యం, డ్రగ్స్, వైద్యులు సూచించిన మందులు అన్నీ ఒకేసారి తీసుకోవడంతో అవన్నీ కలిసి గుండెపోటుకు దారితీశాయని అధికారులు వెల్లడించారు. రాజకుమారుడి మృతిని సౌదీ రాయల్ కోర్టు అధికారికంగా ధ్రువీకరించింది. రియాద్‌లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకటించింది.
లండన్ హోటల్‌లో సౌదీ ప్రిన్స్ మరణం.. కారణమిదే..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 02:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)