గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రైల్వే కోడూరులో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు బొప్పాయి హార్వెస్టింగ్ పరిశీలన

1 రోజు క్రితం

District Collector Venkateswarlu inspects papaya harvesting in Railway Kodur.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెట్టిన జిల్లా యంత్రాంగం.

బొప్పాయి రైతులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు.


ప్రజాశక్తి రైల్వేకోడూరు (తిరుపతి) : తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లి పంచాయతీ లోని మారావారిపల్లి కు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వర్లు బుధవారం బొప్పాయి రైతులను తోటలలో కలిశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మారావారిపల్లె లో బొప్పాయి రైతులతో కాసేపు ముచ్చటించి బొప్పాయి తోటను పరిశీలించి రేట్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ఇస్తున్నారా లేదా అని బొప్పాయి రైతులని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా భారతదేశంలో పూణే, మహారాష్ట్ర, బెంగళూరు, మదనపల్లి ప్రాంతాలలో రేటు ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో ఒక రైల్వేకోడూరు లో మాత్రమే రేటు ఎందుకు స్థిరంగా లేదు అనే విషయాల పైన కూడా రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ .... ప్రస్తుతం బొప్పాయి హార్వెస్టింగ్ సీజన్ పూర్తిస్థాయిలో ఊపందుకుందని ఈ నేపథ్యంలో రైతులకు దక్కుతున్న ధరలు,పంట దిగుబడి, విక్రయాల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, గడిచిన 20 సంవత్సరాలుగా రైల్వే కోడూరు ప్రాంతంలో రైతులు ఉత్తరప్రదేశ్, గుజరాత్,ఢిల్లీ వంటి సుదూర రాష్ట్రాల నుండి వచ్చే వ్యాపారులు ముందుగానే రైతులతో అవగాహన కుదుర్చుకుని, విత్తనాలు సరఫరా చేయడం నుండి హార్వెస్టింగ్, ప్యాకింగ్, రవాణా ఖర్చులన్నీ భరిస్తూ కొనుగోలు చేసే పద్ధతి అమలు చేసుకోవాలని సూచిస్తూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుందని, గతంలో రూ. 5 నుండి రూ. 6 వరకు పడిపోయిన రేట్లను దృష్టిలో ఉంచుకుని,నెల రోజుల క్రితమే వ్యాపారులు, మధ్యవర్తులతో కలెక్టరేట్‌లో గట్టిగా సమావేశం నిర్వహించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని స్పష్టం చేయడంతో ఈసారి కేజీ ధర రూ.17 వద్ద స్థిరంగా కొనసాగుతోందని,అంతేకాకుండా మొత్తం అంచనా దిగుబడి 2,50 లక్షల టన్నులు కాగా ఇప్పటివరకు హార్వెస్ట్ అయినది: 1,75 లక్షల టన్నులు (మరో 10-15 రోజుల్లో పూర్తి)


ప్రస్తుత కేజీ ధర: ₹17 (రూ.16 - రూ.20)

విత్తనాల ధర తగ్గించడమే తదుపరి లక్ష్యం ... రైతులతో చర్చించిన అనంతరం విత్తనాల/మొక్కల వ్యయం పెరిగిపోతుందనే విషయం దృష్టికి వచ్చింది. ఒక మొక్క విత్తనానికే రూ. 25 నుండి రూ. 35 వరకు ఖర్చవుతోంది. వచ్చే సీజన్ నాటికి ఈ ఇన్పుట్ కాస్ట్ (ఉత్పత్తి వ్యయం) తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, వచ్చే నెలలోనే విత్తన సరఫరాదారులతో మాట్లాడి రైతులపై భారం పడకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.


రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పి ఓ) దిశగా అడుగులు ... మదనపల్లె, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో రైతులు సొంతంగా హార్వెస్ట్, గ్రేడింగ్, లోడింగ్ చేసుకుంటూ కేజీకి రూ. 45 నుండి రూ. 50 వరకు పొందుతున్నారు. మన దగ్గర కూడా పంచాయతీకి ఒక ఎఫ్‌పీఓ ఏర్పాటు చేసుకుని, రైతులే స్వయంగా ఎగుమతులు చేసుకునేలా ప్రోత్సహిస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరంలో రైతులకు మంచి ధర దక్కేలా కృషి చేసిన అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు తహసిల్దార్ అమర్నాథ్,ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్