దర్శకుడు శ్రీని తానే రచించి, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మారువేషం’. ఇందులో హీరో వైభవ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు ‘ఇక వేచి చూడటం ముగిసింది. ఒక హత్య, ఒక చిక్కుముడి, వెల్లడి కావాల్సిన ఒక నిజం.. అక్టోబర్ 1న మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. ప్రముఖ నటుడు రాంకీ, హీరోయిన్ వియానా ఇందులో నటిస్తున్నారు. వన్ ఇరోమన్సీ పిక్చర్స్, మంకీ మ్యాన్ కంపెనీ నిర్మాణ సంస్థలపై నటుడు వైభవ్, విజయ్ ఆనంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 1న ‘మారువేషం’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)