బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పాప పుట్టిన తర్వాత కాస్త లావు అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలపై కొందరు ట్రోల్స్ చేశారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆమె.. ‘ఒకరి బరువు గురించి మాట్లాడడానికి మీకు అంత ఖాళీ సమయం ఉందా? అందంగా కనిపించే అమ్మాయిలను చూడాలనుకుంటే వేరే పేజీలు చూసుకోండి’ అని స్పష్టం చేశారు. తల్లి అయిన తర్వాత మహిళల శరీరంలో మార్పులు రావడం సహజమని ఆమె అన్నారు. సినిమాలో అందంగా కనిపించేందుకు సర్జరీలు, ఇంజెక్షన్లు చేయించుకోవడం సాధారణమే కావచ్చు కానీ, కాలంతో పాటు రూపురేఖలు మారడం కూడా సహజమేనని చెప్పారు. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా అయ్యానంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు తనను, తన భర్తను బాధించాయని తెలిపారు. ‘మీరు విమర్శిస్తున్నారని నేను బరువు తగ్గను. ఇంకా లావుగా ఉన్న ఫొటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను’ అని ఆమె అన్నారు. మహిళలు ఏ రంగంలో ఉన్నా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విమర్శిస్తున్నారని బరువు తగ్గను
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)