గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

షార్ట్ సర్క్యూట్ తో పాత సామాన్ల దుకాణంలో అగ్ని ప్రమాదం

6 రోజుల క్రితం

Fire at a scrap shop due to a short circuit.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె సమీపంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా పాత సామాన్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న పాత బ్యాటరీల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్