తిరుపతి : నలుగురు చైన్ స్నాచర్స్ ను అరెస్టు చేసినట్లు తిరుపతి పోలీసులు వెల్లడించారు. సోమవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ .... నలుగురు చైన్ స్నాచర్స్ వద్ద నుండి రూ. 57 లక్షల విలువైన 352 గ్రాముల బంగారం, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 13 కేసుల్లో తిరుపతి పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నలుగురు రేణిగుంట, ఏర్పేడు మండలానికి చెందినవారని అన్నారు. ఒంటరి మహిళలను గుర్తించి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏర్పేడు మండలం రామాపురం గ్రామానికి చెందిన చల్లా రాజేష్, రేణిగుంట మండలం, పెదల్లచెరువు గ్రామానికి చెందిన బొంద శివరామకృష్ణ@ శివ, ఏర్పేడు మండలం మాధవ మాల గ్రామానికి చెందిన చిట్టత్తూరు పవన్ కళ్యాణ్ @పవన్, రేణిగుంట మండలం పెదళ్లచెరువు గ్రామం మేకల కిషోర్ లుగా గుర్తించామన్నారు. జల్సాలకు బెట్టింగులకు బానిసలై చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని వివరించారు. వడమాల పేటలో 1, రామచంద్రాపురంలో 4, తిరుచానూరు పరిధిలో 8 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఈ నలుగురు ఉన్నారని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన పోలీసులకు రివార్డులను అందించారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు.
నలుగురు చైన్ స్నాచర్స్ అరెస్ట్
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)