ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరి మండలంలో టిప్పర్ లారీ లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. శుక్రవారం అక్రమ గ్రావెల్ తరలిస్తూ ఓ ద్విచక్ర వాహనం ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యింది. చంద్రగిరి మల్లయ్యపల్లి అనుపల్లి రోడ్డు ల పై ఓవర్ స్పీడ్ తో టిప్పర్ లారీలు దూసుకెళుతున్నాయి. అక్రమ గ్రావెల్ తరలిస్తూ రోడ్లను సైతం టిప్పర్ లారీలు ధ్వంసం చేస్తున్నాయి. గుంతలు పడ్డ రోడ్లకు అధికారులు , ప్రజాప్రతినిధులు ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదు. గుంతలో పడి వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్ల ద్వారా అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండటంతో గ్రామంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.
చంద్రగిరిలో టిప్పర్ లారీల విధ్వంసం
30 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 02:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)