ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు

07 అక్టోబర్, 2026

tpt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 12:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి: ​తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ, ఎం.బి. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లోని ఫార్మసీ ప్రాక్టీస్ విభాగం ఆధ్వర్యంలో వ్యక్తిగత వైద్య పరిశోధనలపై 4వ ఐఆర్‌పిబిఎంఎస్-2026 అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలేషియాలోని మలయా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వాన్ లన్, చండీఘర్‌కు చెందిన ప్రముఖ నిపుణులు "విపిన్ సింగ్" హాజరయ్యారు. ఎంబీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథిలు పాల్గొని ప్రసంగించారు. ​వైద్యరంగంలో ప్రస్తుతం 'పర్సనలైజ్డ్ మెడిసిన్' విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగినట్లుగా చికిత్స అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. మరి వైద్యంలో ఇన్ని కొత్త పద్ధతులు వస్తున్న వేళ, మన విద్యా విధానంలో ఆవిష్కరణలు ఎందుకు వెనుకబడుతున్నాయి? ​దేశమంతటా విద్యార్థులంతా ఒకే రకమైన సిలబస్, ఒకే రకమైన డిగ్రీలు చదవాల్సి రావడం ప్రధాన సమస్యగా మారుతోంది. నచ్చిన పుస్తకాలు చదివే వెసులుబాటు ఉన్నప్పటికీ, సొంతంగా ప్రయోగాలు చేసి అనుభవం సంపాదించే అవకాశాలు లేకపోవడమే కొత్త ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తోంది. ​ఇలాంటి సమయంలోనే సెమినార్లు, కాన్ఫరెన్సుల పాత్ర అత్యంత కీలకమవుతుంది. ప్రపంచంలో వస్తున్న కొత్త టెక్నాలజీలపై సెమినార్లు అవగాహన కలిగిస్తే, కాన్ఫరెన్సులు మాత్రం నిపుణులు తమ పరిశోధనలు, సవాళ్లు, వైఫల్యాలను పంచుకునే వేదికగా నిలుస్తున్నాయి. ఇక్కడ లభించే ఒక్క చిన్న ఆలోచన విద్యార్థుల కెరీర్ దిశనే మార్చేయగలదు. మన విద్యా విధానంలోనూ, విద్యార్థుల ఆలోచనల్లోనూ అలాంటి ప్రత్యేకత, ప్రయోగపూర్వక జ్ఞానం తోడైనప్పుడే నిజమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని వైస్ ఛాన్సలర్ పివి రమణ గారు పేర్కొన్నారు. అంతర శాఖల సమన్వయంతో వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన వైద్యచికిత్సలు" అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో వర్సిటీ ఔషధ, జీవశాస్త్ర, వైద్య రంగాలలో నూతన పరిశోధనలను ప్రోత్సహించడం, ప్రజలకు మెరుగైన, ఆధునిక ఆరోగ్య సంరక్షణ విధానాలపై అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రముఖులు ప్రసంగించారు.

ఆధునిక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రతి రోగి యొక్క ప్రత్యేక ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్సలను రూపొందించడం, అధునాతన పరిశోధనా ఫలితాలను నేరుగా క్లినికల్ ప్రాక్టీస్‌లోకి తీసుకురావడం, రోగి-కేంద్రిత వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ సదస్సులో లోతుగా చర్చించారు. భారతదేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఆసుపత్రుల ప్రతినిధులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్