మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లా స్థాయి యోగా పోటీల్లో పనపాకం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల జయభేరి

2 గంటల క్రితం

https://prajasakti.com/te-IN/districts/east-gadavari/mother-child-express-vehicle-made-available
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పలు విభాగాల్లో పతకాల పంట


ప్రజాశక్తి-​చంద్రగిరి (తిరుపతి) : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని చాటుతూ పనపాకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు. తాజాగా తిరుపతిలోని లిటిల్ స్టార్ హైస్కూల్‌లో ఆగస్టు 10 న నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి యోగా పోటీలలో పనపాకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.వివిధ విభాగాల్లో పోటీపడి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని పాఠశాలకు వన్నె తెచ్చారు.


​వివిధ విభాగాల్లో విజేతల వివరాలు ....

​14-16 సంవత్సరాల బాల బాలికల విభాగంలో ఎన్. సంతోష్ ప్రథమ స్థానాన్ని, అరిగిల కుందన శిల్ప ప్రథమ స్థానాన్ని సాధించగా, కె. ఐశ్వర్య ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

​12-14 సంవత్సరాల బాల బాలికల విభాగంలో కె. ధనుష్ అగ్రస్థానంలో నిలిచి ప్రథమ స్థానం సాధించగా, వి. వినయశ్రీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.

​10-12 సంవత్సరాల బాల బాలికల విభాగంలో పి. బాలు ద్వితీయ స్థానంలో, ఎ. జ్యోత్స్న తృతీయ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.


​ఘనంగా అభినందన సభ :

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను పనపాకం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,ఎ. మంజువాణి అధ్యక్షతన ఈ అభినందన సభ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​విద్యార్థులను ఈ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యాయామ ఉపాధ్యాయులు వి. జయచంద్ర ప్రత్యేక కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. పతకాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులను గ్రామస్తులు,పాఠశాల సిబ్బంది అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్