తడ (తిరుపతి) : తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. శనివారం శ్రీసిటీ నుంచి కార్మికులు విధులు ముగించుకొని సూళ్లూరుపేటకు వెళ్తున్నారు. తడ సమీపానికి రాగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు రాజుకున్నాయి. అప్రమత్తమైన కార్మికులు వెంటనే బస్సు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రైవేటు బస్సు దగ్ధం
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 13, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)