ప్రజాశక్తి-తిరుపతి : సిపిఎం సీనియర్ నాయకులు, రొంపిచర్ల, పులిచెర్ల మండలాల్లో రాజకీయ, సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన మేకల రంగారెడ్డి గారు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని పులిచెర్లలోని సాయిబాబా ఆలయం సమీపంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. రంగారెడ్డి మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన శ్రద్ధ, సేవాభావం, సాదాసీదా వ్యక్తిత్వం, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సిపిఎం సీనియర్ నాయకులు మేకల రంగారెడ్డి మృతి
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)