మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వీధి కుక్కల తరలింపు కలకలం

1 గంట క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని కేఆర్పీ కాలనీలో వీధి కుక్కల తొలగింపు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసి, రేబిస్ వ్యాక్సిన్లు వేసి తిరిగి అదే ప్రాంతంలో వదలాల్సి ఉంది. కానీ, ఇందుకు పూర్తి విరుద్ధంగా నెల్లూరు నుండి ప్రత్యేక బృందాలను రప్పించి కుక్కలను రహస్యంగా అక్రమంగా తరలిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మున్సిపల్ అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా అనుమతులు లేకుండా స్థానిక కాలనీ కమిటీ సభ్యులు ఏకపక్షంగా, పూర్తిగా ఇష్టానుసారంగా వ్యవహరస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఆరా తీయగా.. తనకు అధకారిక సమాచారం లేదని సూళ్ళూరుపేటమున్సిపల్ కమిషనర్ చిన్నయ్య పేర్కొన్నారు. బాధ్యతాయుతమై అధికారులకే సమాచారం ఇవ్వకుండా కాలనీ కమిటీ సభ్యులు కుక్కల నియంత్రణ చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023లోనూ ఇదే తరహా ఘటనే జరిగిందని స్థానికులు తెలిపారు. అప్పట్లో తిరుపతి నుండి వచ్చిన బృందాలు కుక్కలను పట్టుకెళ్లి అడవుల్లో వదిలేశాయని, దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ తదనంతరం పరిణామాలతో ఆ కేసు నీరుగారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన స్థానికులు, గుంటూరుకు చెందిన ఒక యానిమల్ వెల్ఫేర్ ఎన్జీవో సహాయంతో ఆన్లైన్లో కేసు నమోదు చేయించారు. స్థానిక ఎస్సై అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్