ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : ఆసక్తి, పట్టుదల ఉన్న ప్రతి పాడి రైతులను పారిశ్రామికవేత్తలు అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా .... పశుసంవర్ధక శాఖ వారు 2024 నుండి 2026 వరకు 88 లక్షల 50 వేల రూపాయలను పాడి రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. స్వర్ణ నారావారిపల్లి పైలెట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నారావరపల్లి స్కిల్ డెవలప్మెంట్ భవనంలో తిరుపతి పశుసంవర్ధక శాఖ డైరీ టెక్నాలజీ కళాశాల అధ్యాపకులు మూడు పంచాయతీలలోని పాడి రైతులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాడి రైతులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే నాని అన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రోద్బలంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి , ఐటీ శాఖ మంత్రి గార్ల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గంలో స్వర్ణ నారావారిపల్లి, స్వర్ణ చంద్రగిరి త్వరలో స్వర్ణ చంద్రగిరి నియోజకవర్గ కాబోతోందన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పాడి పరిశ్రమ వైపు వస్తున్నారంటేనే పాడి రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో తెలుస్తుందన్నారు. స్వర్ణ చంద్రగిరిలో భాగంగా క్షీర సాగరం ,విత్తన పొట్టేలు, దూడల పెంపకం, గోకులం షెడ్లు వంటివి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ డైరీ టెక్నాలజీ కళాశాల అధ్యాపకులు స్థానిక పాడి రైతులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు... అనంతరం వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, పాడి రైతులు పాల్గొన్నారు.
పాడి రైతులను పారిశ్రామికవేత్తలయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది : ఎమ్మెల్యే పులివర్తి నాని
04 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 03:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)