సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : యూటీఎఫ్ తిరుపతి జిల్లా కార్యాలయంలో యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ కోశాధికారి ఎం. జనార్దన్‌రెడ్డి, డిగ్రీ కళాశాల లెక్చరర్ ప్రకాష్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, యూటీఎఫ్‌ను ఏర్పాటు చేసిన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత నాయకత్వం ముందుకు సాగాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ ముందుండాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిగ్రీ కళాశాల లెక్చరర్ ప్రకాష్ మాట్లాడుతూ, యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యూటీఎఫ్ చేస్తున్న పోరాటాల ద్వారానే ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం సాధ్యమవుతుందని, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే. ముత్యాలరెడ్డి, గౌరవాధ్యక్షులు దండు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వయ్యాల మధు, జిల్లా కార్యదర్శులు సురేష్, మోహన్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు గురవారెడ్డి, తిరుపతి డివిజనల్ కోఆర్డినేటర్ హస్తి మురళీకృష్ణమరాజు, రేణిగుంట ప్రధాన కార్యదర్శి మురళి, సీనియర్ నాయకులు వెంకటనారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు ఎన్. సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్