సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డీఎస్సీ అవకతవకలపై వైసిపి పాదయాత్ర..

1 గంట క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అడ్డుకున్న పోలీసులు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం బొమ్మూరులోని వైసిపి కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సిద్ధమయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటూ వారిని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్