సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల పర్యవేక్షణలో పొగాకు కొనుగోళ్లు

1 గంట క్రితం

tobaco
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారుల జోక్యం

ప్రజాశక్తి-ప్రకాశం : పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపిస్తూ గత శనివారం వేలం బహిష్కరించి రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర తదితర అంశాలపై ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వేలం నిర్వహణ అధికారి, వ్యాపారస్తులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఆందోళనలు పునరావృతం కాకుండా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పొదిలి ఎస్సై సూరెడ్డి రాజేష్ వేలం కేంద్రంలో పర్యవేక్షిస్తూ, వేలం నిర్వహణ అధికారి, వ్యాపారస్తులతో మాట్లాడుతున్నారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా చూడాలని సూచిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్