సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిపక్ష‍ాల నిరసన

1 గంట క్రితం

Priyanka Gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పార్లమెంటులో ప్రతిపక్ష‍ాల నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసుల చర్య, రామమందిర విరాళాల చోరీ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష‍ ఎంపిలు సోమవారం పార్లమెంటులో నిరసన చేపట్టారు. హోంమంత్రి సభలో వివరణ ఇచ్చే వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం నుండి అధికారిక స్పందన రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తుందని అన్నారు. ప్రతిపక్షాల గొంతులను, సామాజిక సంస్థలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ సంస్థలపై పూర్తి నియంత్రణ సాధించాలని చూస్తోందని మండిపడ్డారు. ‘‘మోడీ ప్రభుత్వం నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తోంది. ఈ దేశంలో నియంతృత్వం పనిచేయదు."అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్