గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాంస్కృతిక సభపై జరిగిన దాడిని ఖండిస్తూ పాటలు పాడుతూ నిరసన

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- గాంధీ విగ్రహం వద్ద ప్రజానాట్యమండలి, ఎస్ఎఫ్ఐ నిరసన

ప్రజాశక్తి-విశాఖ: ఓట్లు చోరీకి పాల్పడిన జ్ఞానేష్ కుమార్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సాంస్కృతిక సభపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు తేదీ అక్టోబర్ 8న విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజానాట్యమండలి, ఎస్ఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో పాటలు పాడుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ని తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిర్వహించిన సాంస్కృతిక వేదికపై ఢిల్లీ పోలీసులు మరియు ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. తక్షణం జ్ఞానేశ్ కుమార్ ను రాజీనామా చేయాలని ప్రజల ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రకమైన దాడులు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఇటువంటి దుర్మార్గ దాడులను తక్షణం ఆపాలని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎం చంటి పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ గరల్స్ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్ టి. మౌనిక మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాపాడాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై ఇటువంటి భౌతిక దాడులు చేయడం బిజెపి ఆర్ఎస్ఎస్ యొక్క పిరికి బంధ చర్యాని ఇటువంటి దుర్మార్గ విధానాలు విడనాడాలని లేకపోతే విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలి తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీ రమణ, ఉపాధ్యక్షులు కే సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు టి. మౌనిక, జిల్లా నాయకురాలు ఏ భవ్య శ్రీ, గురజాడ సాంస్కృతిక వేదిక నాయకులు అనపర్తి అప్పారావు, ఐద్వా మహిళా సంఘం నాయకులు కే కుమారి, ప్రజానాట్యమండలి విశాఖ జిల్లా నాయకులు కేటీయు భాస్కర్, ఎన్వి రమణ, రాంబాబు, పుష్ప, సన్యాసమ్మ, పీతల అప్పారావు, ఓ విజయ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్