శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన..

56 నిమిషాల క్రితం

protes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 01:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలోని స్ప్రింగ్ రోడ్ పూర్ణ మార్కెట్లో సెంట్రల్ ఎన్నికలు కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన తెలియజేసి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు వై రాజు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల ఓట్లను అన్యాయంగా తొలగించిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికలు కమిషనర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జ్ఞానేశ్ కుమార్ ని కాపాడుతున్న మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విధానాలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో జ్ఞానేశ్ కుమార్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలో పాల్గొన్నటువంటి యువతే యువకులపై అత్యంత హేయమైన రీతిలో ఢిల్లీ అమిత్ షా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషనర్ కి మద్దతుగా నిలబడడం అత్యంత దారుణమని ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో జగదాంబ జోన్ సిపిఎం కన్వీనర్ ఎం సుబ్బారావుతో పాటు చంద్రశేఖరం పెద్ద సంఖ్యలో ముఠా వర్కర్స్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్