మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మట్టి కుప్పలో నాలుగు మృతదేహాలు, తొమ్మిది పుర్రెలు

6 గంటల క్రితం

VIZAG
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డంపింగ్‌ యార్డులో కలకలం, ఉలిక్కిపడిన స్థానికులు

ప్రజాశక్తి - గాజువాక (విశాఖపట్నం) : షీలానగర్ జంక్షన్ నుంచి పోర్టు రోడ్డుకు వెళ్లే దారిలోని డంపింగ్ యార్డులో సోమవారం అర్ధరాత్రి లారీలతో మట్టి తీసుకొచ్చి అన్‌‌లోడింగ్‌ ‌చేయగా అందులో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒక మహిళ మృతదేహం ఉంది. వీటితో పాటు తొమ్మిది పుర్రెలు లభ్యమయ్యాయి. ఒకేసారి ఇన్ని మృతదేహాలు, పుర్రెలు బయటపడటంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. సౌత్ ఎసిపి శ్రీనివాసరావు కథనం ప్రకారం... షీలా నగర్ జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్లే మార్గమధ్యంలో ఖాళీ ప్రదేశంలో వివిధ రకాల మెటీరియల్‌‌ను డంప్‌ ‌చేస్తుంటారు. సోమవారం అర్ధరాత్రి రెండు లారీలతో వచ్చిన మట్టిని అన్‌‌లోడ్‌ ‌చేశారు. ఉదయాన్నే ఆ రోడ్డు వెంబడి వెళ్తున్న వ్యక్తులకు మృతదేహాలు కనిపించాయి. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాజువాక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా డికంపోజ్ అయిన మృతదేహాలు, పాతదిండ్లు, శవాలను కప్పెట్టే బాక్సులు, బొంతలు తమకు కనిపించాయని వారు తెలిపారు. అసలు ఈ మృతదేహాలు ఎవరివి, ఇక్కడికి ఎలా వచ్చాయన్న విషయమై పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మట్టిలో ఇంకా ఏమైనా మృత దేహాలు ఉన్నాయేమోనని గాజువాక సిఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్