విశాఖ : ఆంధ్ర యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు... యూనివర్సిటీలోని హాస్టల్స్ గదుల్లోకి వర్షపు నీరు చేరిందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులంతా డిమాండ్ చేస్తూ ... యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. స్టూడెంట్స్ అంతా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వర్షంలో నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అజయ్ నిఖిల్, పిడిఎస్ విశ్వ ఏబీవీపీ చందు తరుణ్ తదితరులు ఆందోళన చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాతవాహన హాస్టల్ పై కప్పు పగుళ్ల ద్వారా గదుల్లోకి వర్షపు నీరు కారుతుందని, తక్షణమే హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలని విద్యార్థులంతా డిమాండ్ చేస్తూ వర్షంలో యూనివర్సిటీ ప్రాంగణంలో బైఠాయించి నినదించారు. హాస్టల్ గదుల్లోకి నీరు కారుతోందని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు.









కామెంట్‌లు (0)