విశాఖ : రాజ్యాంగానికి విరుద్ధంగా కోట్లాది ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. బుధవారం విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ... జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో ఎస్ఎఫ్ఐ నాయకులు అజయ్, నిఖిల్, కౌశిక్, డివైఎఫ్ఐ నాయకులు రాజు శేఖర్, తదితరులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు.

















కామెంట్లు (0)