* రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్
పరవాడ -భరిణికం రహదారి మధ్యలో మొల్లోడు గెడ్డలోకి ఫార్మా వ్యర్థ రసాయనికి జలాలు విడుదల చేస్తున్న విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, వైసిపి నేత భరణికం మాజీ సర్పంచ్ పెద్దిశెట్టి శేఖర్, టిడిపి మాజీ సర్పంచ్ బోండా తాతారావు, కేశవ డిమాండ్ చేశారు. ఈ మేరకు మొల్లోడు గెడ్డలో విడుదల చేసిన వ్యర్థ రసానికి జలాలను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాంకీ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి గాలి, నీరు, నేల కాలుష్యం చేస్తుందని ఆరోపించారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాంకీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సిఐటియు, సిపిఎం కేసు వేయడం జరిగిందని తెలిపారు.








కామెంట్‌లు (0)