విశాఖపట్నం:
స్థానిక జీవీఎంసీ మెయిన్ హైస్కూల్లో 9 వ తరగతి చదువుతున్న షేక్ సుభాని వెయిట్ లిఫ్టింగ్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కాకినాడలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు బ్రహ్మాజీ, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్వి.నరసింహం తెలియజేశారు. షేక్ సుభానిని హెచ్‌ఎం బ్రహ్మాజీ, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు అభినందించారు.








కామెంట్‌లు (0)