ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా 4వ మహాసభ నవంబర్ 21వ తేదీన కశింకోట మండలం తాళ్లపాలెంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రా దేముడు తెలిపారు. శనివారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు ఏడాదిలో కేవలం 5 నెలలు మాత్రమే ఉపాధి ఉంటుందని, మిగిలిన 7 నెలలు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని, అందువల్ల కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆడుకోవాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు దాటిన యువకులను గీత కార్మికులుగా నమోదు చేయాలని, ఆదరణ పథకం ద్వారా వృత్తిని ఆడుకోవాలని, బ్రాంది షాపులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిన నాగేశ్వరరావు, కట్టా ఈశ్వరరావు, కాకర సుబ్బారావు, గీత కార్మికులు పాల్గొన్నారు.
నవంబర్ 21న కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభ
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)