ప్రజాశక్తి -తగరపువలస
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్కెవిటి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 11,12,13 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 17 విభాగం బాలురు, బాలికల ఫుట్ బాల్ టోర్నీలో ఉమ్మడి విశాఖ జిల్లా జట్టు విజయం సాధించినట్లు ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వర్మ తెలిపారు. ఫైనల్స్లో కర్నూలు జిల్లా జట్టు పై ఉమ్మడి విశాఖ జిల్లా జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. కోచ్ రాజేంద్ర కుమార్ నేతృత్వంలో టెన్త్ విద్యార్థి కోలా భాగ్యేష్ సారధ్యంలో ఉమ్మడి విశాఖ జట్లు టోర్నీ ఆద్యంతం మంచి ప్రతిభను కనబరిచి విజేతగా నిలిచి, కాకినాడ ఫిజికల్ ఎడ్యుకేషన్ రీజనల్ ఇన్స్పెక్టర్ బి జాన్సన్ నుంచి విజేత ట్రోఫీని కెప్టెన్ భాగ్యేష్ అందుకున్నారు.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న టోర్నీలో వరుసగా మూడేళ్లు విజేతగా నిలవడం ద్వారా ఉమ్మడి విశాఖ జట్టు హ్యాట్రిక్ సాధించిందని కోచ్ రాజేంద్రకుమార్ను డిఇఒ ప్రేమ్కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వర్మ అభినందించారు.







కామెంట్లు (0)