ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టపగలు చోరీకి యత్నం - ముగ్గురు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగింత

5 రోజుల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 05:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -​మధురవాడ,

పోతిన మల్లయ్య పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మారికవలసలో మంగళవారం ఉదయం పట్టపగలే దొంగతనానికి యత్నించిన ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.వారి వద్ద లభించిన సిరంజీలను చూసి తొలుత మత్తు ముఠాగా ప్రచారం జరిగినప్పటికీ, అవి డ్రగ్స్ కాదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివి.

మారికవలసకు చెందిన గరికిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం 7గంటల ప్రాంతంలో ముగ్గురు యువకులు చొరబడ్డారు. ఇద్దరు బయట కాపలా ఉండగా,ఒకరు లోపలికి వెళ్లి రూ.3,500 నగదు, ఒక జత వెండి పట్టీలు, ఆరు బంగారు గాజులు దొంగిలించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఇంటి యజమాని వచ్చి, నిందితులను గమనించి కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురిని పట్టుకుని దేహశుద్ధి చేసి పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు.​పీఎం పాలెం క్రైమ్ ఎస్ఐ సూర్యప్రకాష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు ఎంవిపి కాలనీకి చెందిన అంజూరి సాయిసూర్య, మహారాణిపేటకు చెందిన వల్లూరి యశ్వంత్, ఆరిలోవకు చెందిన ఎద్దు సుశాంత్ అలియాస్ చెర్రీగా గుర్తించారు. వీరిపై గతంలో ఆరిలోవ, త్రీటౌన్, ఎంవీపీ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.​ పట్టుబడిన యువకుల నుంచి ఖాళీ సిరంజీలు, లిప్‌స్టిక్‌లు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ సీఐ బిఎస్ఎస్. ప్రకాష్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్